vyramuttu: వైరముత్తు మనిషి..ఆయనకూ హార్మోన్లు ఉంటాయి: దర్శకుడు, నటుడు మరిముత్తు

  • వైరముత్తుపై వచ్చిన ఆరోపణలపై మరిముత్తు స్పందన 
  • దొంగతనం చేస్తే సిగ్గుపడాలి కానీ మహిళను పిలిస్తేనా?
  • మహిళకు ఇష్టమైతే వెళ్తుంది లేకపోతే మీడియాను ఆశ్రయిస్తుంది
కొన్నేళ్ల క్రితం తమిళ సినీ రచయిత వైరముత్తు తనను గదికి రమ్మన్నారంటూ గాయని చిన్మయి శ్రీపాద ఇటీవల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు దర్శకుడు, నటుడు మరిముత్తు మద్దతుగా నిలిచారు. ఓ ఇంటర్వ్యూలో వైరముత్తుపై వచ్చిన లైంగిక ఆరోపణల విషయమై మరిముత్తు అభిప్రాయాన్ని కోరగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైరముత్తు ఏదైనా బంగారం దుకాణంలో దొంగతనం చేస్తే సిగ్గుపడాలి తప్ప, ఓ మహిళను తన గదికి రమ్మనడాన్ని తప్పుబట్టడం ఎందుకని ప్రశ్నించారు. వైరముత్తు కూడా మనిషేనని, ఆయనకూ హార్మోన్లు ఉంటాయిగా అంటూ వ్యాఖ్యానించారు. వైరముత్తుకు మహిళతో గడపడంలో ఆనందం ఉందేమో, మహిళకు ఇష్టమైతే వెళ్తుంది లేకపోతే మీడియాను ఆశ్రయిస్తుందని అన్నారు. వైరముత్తుపై ఆరోపణలు చేసిన సదరు మహిళ ఇప్పుడు మీడియాను ఆశ్రయించిందంటూ మరిముత్తు పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాలు వేదికగా మరిముత్తుపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
vyramuttu
marimuttu
chinami sripada

More Telugu News