ys jagan: నన్ను చంపేస్తున్నారు..నాకు ప్రాణహాని ఉంది: నిందితుడు శ్రీనివాసరావు ఆరోపణలు

  • నన్ను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారు
  • ప్రజలతో మాట్లాడే అవకాశం నాకు కల్పించాలి
  • జగన్ పై దాడి వెనుక ఎవరి పాత్ర లేదు
వైసీపీ అధినేత జగన్ పై కత్తి దాడికి పాల్పడ్డ శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించాయి. విశాఖలోని కేజీహెచ్ లో చెకప్ అనంతరం అతన్ని తిరిగి కస్టడీకి తరలిస్తున్న సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. తనకు ప్రాణహాని ఉందని, తనను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారంటూ వ్యాఖ్యలు చేశాడు. ప్రజలతో మాట్లాడే అవకాశం తనకు కల్పించాలని వేడుకున్నాడు. జగన్ అంటే తనకు ప్రాణమని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేవుడు లాంటి వారని అన్నారు. జగన్ పై తాను చేసిన దాడి వెనుక ఎవరిపాత్ర లేదని, ప్రజా సమస్యలు జగన్ దృష్టికి వెళ్లాలనే ఇలా చేశానని అన్నాడు. తనను చంపి రాజకీయం చేయాలనుకుంటున్నారని ఆరోపించాడు. 
ys jagan
Vizag
srinivas

More Telugu News