modi: వైసీపీని లొంగదీసుకుని మోదీ రాజకీయాలు చేస్తున్నారు: సీఎం చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను పోరాడుతుంటే, వైసీపీని లొంగదీసుకుని మోదీ రాజకీయాలు చేస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో జరుగుతున్న ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంపై అవిశ్వాసం తీర్మానం పెట్టిన టీడీపీని మోదీ బెదిరించారని, అవిశ్వాస సమయంలో టీడీపీ ఎంపీలకు సన్మానం చేస్తానని నాడు పార్లమెంట్ లో మోదీ వ్యాఖ్యానించడం దారుణమని అన్నారు. ఈ సందర్భంగా ఏపీలో ఐటీ దాడులు జరుగుతుండటంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో ఫిన్ టెక్ సదస్సు జరుగుతుంటే ఐటీ దాడులతో భయపెట్టాలని కేంద్రం చూస్తోందని, ఐటీ అధికారులు, సీబీఐని అడ్డం పెట్టుకుని టీడీపీ ఎంపీలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ నేతలందరిపై ఐటీ దాడులు చేసినా భయపడమని, ఏపీకి న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని, ఆంధ్రప్రదేశ్ కు న్యాయం చేసే వరకు కేంద్రాన్ని వదిలిపెట్టనని గట్టిగా చెబుతున్నానని హెచ్చరించారు.
Go Back to Shorts
modi
Chandrababu
YSRCP

More Telugu News