Ashokgajapathiraju: టీడీపీకి 25 ఏంపీ స్థానాలు కట్టబెట్టండి: అశోక్ గజపతి రాజు

  • విజభన హామీల అమలు జాతీయ పార్టీలదే
  • బీజేపీ, వైసీపీపై విమర్శలు
  • టీడీపీతోనే ఏపీ అభివృద్ధి సాధ్యం
కడప జిల్లా ప్రొద్దుటూరులో  తెలుగు దేశం పార్టీ తలపెట్టిన ‘ధర్మ పోరాట దీక్ష’లో టీడీపీ నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడారు. తెలుగు దేశం పార్టీ కార్యకర్తగా ఉండే అవకాశం తమలాంటి వ్యక్తులకు లభించడం, చంద్రబాబు, టీడీపీ కుటుంబ సభ్యులందరూ ఆ అవకాశాలు ఇవ్వడంతో కేంద్రప్రభుత్వంలో దాదాపు నాలుగు సంవత్సరాలు పని చేసే అవకాశం లభించిందన్నారు.

రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన బృందం ఏపీని అభివృద్ధి, సంక్షేమ మార్గంలో నడిపించేందుకు, దేశంలో మొదటి రాష్ట్రంగా తీర్చిదిద్దితే తెలుగు వాడికి కేంద్ర ప్రభుత్వంలో అవకాశం దక్కిందన్నారు. సివిల్ ఏవియేషన్‌ను ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందే స్థాయికి భారత దేశాన్ని తీసుకురాగలిగామన్నారు. తామందరం ధర్మాన్ని పాటించడం వల్ల ఇది జరిగిందన్నారు. ప్రజాస్వామ్యంలో ధర్మాన్ని పాటించడం చాలా ముఖ్యమన్నారు. ప్ర

జలు ఎంపిక చేసిన ప్రజా ప్రతినిధులు శాసనసభకు వెళ్లరని, పని చేయరని వైసీపీని విమర్శించారు. శాసనసభలో ప్రతిపక్షహోదా ఇచ్చినా భయపడి పారిపోయే రోజులివి అన్నారు. జాతీయ పార్టీలు, రాష్ట్రాన్ని విభజించాయని, జాతీయ పార్టీల మద్ధతుతో విభజన చేశారని, జాతీయ పార్టీలు దానికి సాక్షిగా ఉన్నాయన్నారు. విభజన హామీలను అమలు చేసే బాధ్యత జాతీయ పార్టీలపైనే ఉందన్నారు.

జాతీయ పార్టీలు ఆ పని చేయలేకపోతే ప్రాంతీయ పార్టీగా జాతీయ భావాలు ఉన్న టీడీపీ ఏం చెయ్యాలని ప్రశ్నించారు. ప్రజల దగ్గరకు వెళ్లి వారి సహకారాన్ని అర్జించాలని, టీడీపీకి 25 ఎంపీ స్థానాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో అసలైన నాయకత్వానికి, దొంగల నాయకత్వానికి తేడా అర్థం చేసుకుని, దొంగలందరినీ జైలుకు వెళ్లేటట్లు.. నాయకులందరినీ శాసన సభకు వెళ్లి మీ సమస్యలు పరిష్కారానికి పోరాడే విధంగా ఆ బలాన్ని టీడీపీకి ఇవ్వాలని విన్నవించారు. అలాగైతేనే ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచంలో మొదటి స్థానానికి రావడానికి అవకాశం ఉంటుందన్నారు.
Ashokgajapathiraju
Telugudesam
Andhra Pradesh

More Telugu News