ys jagan: జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును పరీక్షించిన వైద్యులు

  • తన చేతులు, ఛాతి నొప్పిగా ఉన్నాయన్న నిందితుడు
  • అతనికి బీపీ, షుగర్ సాధారణంగా ఉన్నాయి
  • వైద్యం వద్దని, తన అవయవాలు తీసుకుపోండని అంటున్నాడు: వైద్యుడు దేవుడుబాబు
జగన్ పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును వైద్యులు పరీక్షించారు. ఈ సందర్భంగా వైద్యుడు దేవుడు బాబు మాట్లాడుతూ, శ్రీనివాసరావు తన చేతులు, ఛాతి నొప్పిగా ఉన్నాయని చెప్పాడని, దీంతో, క్షుణ్ణంగా పరీక్షించామని వైద్యులు చెప్పారు. శ్రీనివాసరావుకు బీపీ, షుగర్ సాధారణంగా ఉన్నాయని, తనకు వైద్య సహాయం వద్దని, తన అవయవాలు తీసుకుపోండంటూ అతను చెబుతున్నాడని అన్నారు. శ్రీనివాసరావును కేజీహెచ్ కు తరలించాలని సూచించామని చెప్పారు. శ్రీనివాసరావును కేజీహెచ్ కు తరలించేందుకు ఏర్పాట్లు పోలీసులు చేస్తున్నట్టు సమాచారం.
ys jagan
srinivasa rao
kgh
doctor devudu babu

More Telugu News