operation garuda: ‘ఆపరేషన్ గరుడ’ టీడీపీ సృష్టే: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • రాజ్ నాథ్ సింగ్ ను కలిసిన ఏపీ బీజేపీ నేతలు
  • ‘తిత్లీ’తో నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకోవాలని కోరాం
  • జగన్ మీద జరిగిన దాడి ఘటనపైనా విచారణ కోరాం
కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను ఏపీ బీజేపీ నేతలు ఈరోజు కలిశారు. ఢిల్లీలో రాజ్ నాథ్ ని కలిసిన వారిలో ఎమ్మెల్సీ మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, రఘురాం ఉన్నారు. అనంతరం, మీడియాతో మాధవ్ మాట్లాడుతూ, తిత్లీ తుపాన్ తో నష్టపోయిన ఉత్తరాంధ్రను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశామని, విపత్తు సహాయ నిధి నుంచి వెంటనే తక్షణ సాయం అందజేయాలని కోరామని చెప్పారు. ‘ఆపరేషన్ గరుడ’ పేరిట జగన్ మీద జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపించాలని, అంతర్గత నివేదిక తెప్పించుకుని చర్యలు చేపట్టాలని కోరామని అన్నారు. ‘ఆపరేషన్ గరుడ’ టీడీపీ సృష్టేనని మాధవ్ ఆరోపించారు.
operation garuda
bjp
mlc madhav

More Telugu News