Amit Shah: మోదీ, అమిత్ షా నుంచి దేశాన్ని రక్షించేందుకు చంద్రబాబు నడుం బిగించారు: జూపూడి

  • టీడీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు
  • గవర్నర్ బీజేపీ ఏజెంట్‌గా పనిచేస్తున్నారు
  • కోడికత్తి డ్రామాలో వైసీపీ అపహాస్యం పాలైంది
టీడీపీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచి కూలదోయడానికి రాజ్‌భవన్ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ బీజేపీ ఏజెంట్‌లా పనిచేస్తున్నారన్నారని విమర్శించారు. జగన్‌పై దాడి విషయంపై ఆరా తీసేందుకు ఏపీ డీజీపీకి గవర్నర్ ఫోన్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. మోదీ, అమిత్‌షా నుంచి దేశాన్ని రక్షించేందుకు చంద్రబాబు నడుం బిగించారన్నారు.

కోడికత్తి డ్రామాలో వైసీపీ అపహాస్యం పాలైందని ఎద్దేవా చేసిన ఆయన కోడికత్తి డ్రామాకు కొనసాగింపుగా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కోడికత్తిని తీసుకెళ్లిన దొంగకు, బోత్సకు ఉన్న సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Amit Shah
BJP
Jupudiprabhakar
Telugudesam

More Telugu News