Chandrababu: చంద్రబాబు ఇప్పటివరకు జగన్ ను పరామర్శించలేదు!: పార్థసారథి

  • జగన్ ని పరామర్శించిన వారిని బాబు తప్పుబడతారా?
  • చంద్రబాబు, డీజీపీ వ్యాఖ్యలపై అనుమానాలు ఉన్నాయి
  • ఈ సంఘటనను తగ్గించి చూపేందుకు ప్రయత్నించారు?
కత్తిపోటుకు గురైన జగన్ ని సీఎం చంద్రబాబు ఇంతవరకూ పరామర్శించలేదని వైసీపీ నేత పార్థసారథి విమర్శించారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ, పరామర్శించిన వారిని సైతం చంద్రబాబు తప్పుబట్టడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పై దాడి ఘటనకు సంబంధించి చంద్రబాబు, ఏపీ డీజీపీ వ్యాఖ్యలు ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తున్నాయని, ఈ ఘటనకు బాధ్యత వహించాల్సి వస్తుందని ఎయిర్ పోర్ట్ తమ పరిధిలో లేదంటారా? సీఐఎస్ఎఫ్ పరిధిలో ఉంటే గంటలోపే నిందితుడి సమాచారాన్ని డీజీపీ ఎలా సేకరించారు? ఈ సంఘటన జరగకముందే నిందితుడి సమాచారం డీజీపీ వద్ద ఉందా? కేవలం ప్రచారం కోసమే జగన్ పై దాడి జరిగిందని డీజీపీ తేల్చేశారని, సంఘటనను తగ్గించి చూపడానికి ఎందుకు ప్రయత్నించారు? అని ప్రశ్నించారు. నాడు చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానవత్వంతో స్పందించిన విషయాన్ని ఈ సందర్భంగా పార్థసారథి గుర్తుచేశారు.
Chandrababu
Telugudesam
jagan
YSRCP
parthasaradhi

More Telugu News