bellamkonda srinivas: బెల్లంకొండతో గోపీచంద్ మలినేని మూవీ

  • ఆసక్తి చూపని సాయిధరమ్ తేజ్  
  • బెల్లంకొండను ఒప్పించిన గోపీచంద్
  • సెట్స్ పైకి వెళ్లే దిశగా పనులు  
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ క్రితం ఏడాది 'విన్నర్' అనే సినిమా చేశాడు. ఈ సినిమా ఆయన అభిమానులను పూర్తిగా నిరాశ పరిచింది. దాంతో ఆ తరువాత సినిమాతోనైనా తేజుకి హిట్ ఇవ్వాలని గోపీచంద్ భావించాడు. అందుకోసం అనూహ్యమైన మలుపులతో సాగే ఒక కథను సిద్ధం చేసుకున్నాడు.

'యూటర్న్' సినిమా చేసిన నిర్మాతలు కూడా రెడీగానే వున్నారు. 'విన్నర్' సక్సెస్ కాకపోయినప్పటికీ, కొత్త కథలో కొత్తదనం కారణంగా తేజు అంగీకరించడాని చెప్పుకున్నారు. కానీ వరుస పరాజయాలతో వున్న తేజు, ఈ ప్రాజెక్టుపై పెద్దగా ఆసక్తిని చూపించలేదు. దాంతో ఈ కథలో కాస్త మార్పులు చేసి బెల్లంకొండ శ్రీనివాస్ ను ఒప్పించాడు గోపీచంద్. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న బెల్లంకొండ శ్రీనివాస్, ఆ తరువాతనే గోపీచంద్ మలినేనితో చేయనున్నట్టు సమాచారం.  
bellamkonda srinivas

More Telugu News