daler mehandi: ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీ ఇంట విషాదం

  • ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • విషయాన్ని వెల్లడించిన మికాసింగ్
  • తమకు తీరని లోటు అంటూ ఆవేదన
ప్రముఖ గాయకుడు దలేర్ మెహందీ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు అమర్ జీత్ సింగ్ మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన... ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని దలేర్ మెహందీ మరో సోదరుడు, గాయకుడు మికాసింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తమ అన్నయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని వెల్లడించారు. దలేర్ మెహందీ, హర్ జీత్ మెహందీ, జోగేందర్ సింగ్ లతో పాటు తనకు ఇది తీరని లోటు అని చెప్పారు. 
daler mehandi
brother
amar jeeth sing
dead

More Telugu News