Tirumala: హత్యాయత్నం గురించి శివాజీకి ముందే ఎలా తెలుసు?: రోజా

  • తిరుమలకు వచ్చిన రోజా
  • పథకం ప్రకారమే జగన్ పై దాడి
  • శివాజీ అమెరికా ఎందుకు పారిపోయాడు
  • అతన్ని విచారించాలని రోజా డిమాండ్
వైకాపా అధినేత వైఎస్ జగన్ పై దాడి జరుగుతుందని నటుడు శివాజీకి ముందే ఎలా తెలుసన్న విషయాన్ని విచారించాలని ఆ పార్టీ మహిళా నేత రోజా డిమాండ్ చేశారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకున్న అమె, అనంతరం మీడియాతో మాట్లాడారు. జగన్ పై పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారని గుర్తు చేసిన ఆమె, శివాజీ ఆ విషయాన్ని ముందే ఎలా చెప్పారన్న విషయాన్ని విచారించాలని అన్నారు.

దాడి జరిగే సమయానికి శివాజీ, అమెరికాకు ఎందుకు పారిపోయాడని ప్రశ్నించిన ఆమె, శివాజీతో పాటు రెస్టారెంట్ యజమాని హర్షను ప్రశ్నిస్తే, మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. జగన్ పై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Tirumala
Roja
Sivaji
Jagan
Attack

More Telugu News