Aamani: మరో హీరోయిన్... తమిళ సినిమాలో చాన్స్ కొట్టేసిన ఆమని మేనకోడలు!

  • 'విడియాద ఇరవొండ్రు వేండుం' చిత్రంలో హీరోయిన్ గా హృతిక
  • ఈ సినిమా తరువాత చాలా అవకాశాలు వస్తాయన్న నమ్మకం
  • అత్తలా పేరు తెచ్చుకుంటానంటున్న హృతిక
ఆమని గుర్తుందా? తెలుగులో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, మెప్పించింది. ఇప్పుడామె మేనకోడలు హృతిక, హీరోయిన్ గా వచ్చేస్తోంది. దర్శకుడు మురుగన్ తన తాజా చిత్రం 'విడియాద ఇరవొండ్రు వేండుం' అనే సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు.

 ఇదే విషయాన్ని వెల్లడించిన హృతిక, తన అత్త తెలుగులో మంచి గుర్తింపు పొందిందని, మామయ్య ఎన్నో సినిమాలు నిర్మించారని గుర్తు చేస్తూ, వారిద్దరి ఆశీస్సులతో తాను కోలీవుడ్ లోకి వచ్చానని చెప్పింది. చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకున్నానని, సినిమా డ్యాన్స్ కూడా వచ్చని అంది. ఈ సినిమా తరువాత చాలా అవకాశాలు వస్తాయని నమ్ముతున్నానని, అత్త కన్నా ఎక్కువ సినిమాల్లో నటించాలన్నదే లక్ష్యమని హృతిక చెబుతోంది.
Aamani
Hritika
Kollywood
Movies
Heroine

More Telugu News