Amyra Dastur: ఓ పెద్ద హీరో అల్లుడు, స్టార్ హీరో నన్ను వేధించాడు.. అతడిని వదలను: నటి అమైరా దస్తర్

  • నాపై చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించాడు
  • దర్శకుడికి చెబితే, నరకం చూపించాడు
  • అతడిని బజారు కీడ్చడం ఖాయం
దక్షిణాదికి చెందిన ఓ పెద్ద హీరోకి అల్లుడైన ఓ స్టార్ హీరో తనను వేధించాడంటూ నటి అమైరా దస్తర్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతానికి అతడి పేరు బయటపెట్టలేకపోతున్నానని, కానీ ఏదో ఒక రోజు అతడి బండారం బయటపెడతానని పేర్కొంది. తనను లైంగిక వేధింపులకు గురిచేసిన అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోనని శపథం చేసింది.  

తనకు ఉత్తరాది, దక్షిణాది సినీ రంగంల్లోనూ వేధింపులు ఎదురయ్యాయన్న అమైరా ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలోనే హీరోయిన్లపై వేధింపులు ఎక్కువని పేర్కొంది. ఆ హీరోతో ఓ సినిమా చేస్తున్నప్పుడు తనపై అసభ్యకరంగా చేతులు వేసి ఇబ్బంది పెట్టాడని ఆరోపించింది. వెంటనే ఆ విషయాన్ని దర్శకుడితో చెబితే, విషయం తెలిసిన హీరో తనకు అప్పటి నుంచి నరకం చూపించాడని ఆవేదన వ్యక్తం చేసింది. షూటింగ్‌కు ఉదయం 8 గంటలకే రమ్మనేవారని, తీరా రెడీ అయితే, సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఐదు నిమిషాలు షూట్ చేసేవారని పేర్కొంది.

ఓసారి సాయంత్రం వరకు కూర్చోబెట్టి షూట్ చేయకుండానే పేకప్ చెప్పారని వాపోయింది. అప్పటి నుంచి దక్షిణాది సినిమాలు చేయాలంటేనే భయం వస్తోందని అమైరా పేర్కొంది.  పెద్ద హీరోకి అల్లుడైన అతడి పేరును బయటపెడితే తన కెరీర్‌ను సర్వనాశనం చేస్తారన్న భయంతోనే చెప్పడం లేదని అమైరా పేర్కొంది. కానీ అతడిని మాత్రం వదలబోనని, ఏనాటికైనా అతడిని బయటకు ఈడుస్తానని హెచ్చరించింది. అమైరా ఆరోపణల తర్వాత ఆ పెద్ద హీరో అల్లుడు ఎవరన్న దానిపై సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Amyra Dastur
Bollywood
Tollywood
Actress
Me too

More Telugu News