Kaushal: రాజకీయాల్లోకి ‘బిగ్‌బాస్’ విజేత.. ఆలోచిస్తున్నానన్న కౌశల్!

  • కర్నూలులో అభిమానులతో కలిసి అన్నదానం
  • వందలాదిమంది హాజరు
  • సమాజసేవకు రాజకీయాలు మంచి మార్గమన్న కౌశల్
బిగ్‌బాస్ రియాలిటీ షోతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కౌశల్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా? స్వయంగా కౌశలే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. సోమవారం కర్నూలు వచ్చిన కౌశల్ అభిమానులతో కలిసి అన్నదానం నిర్వహించాడు. ఈ కార్యక్రమానికి వందలాదిమంది అభిమానులు హాజరయ్యారు. కౌశల్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

కార్యక్రమం అనంతరం కౌశల్ మాట్లాడాడు. సమాజ సేవ చేయాలన్నది తన కోరిక అని, ఇందుకోసం రాజకీయాల్లోకి వచ్చే విషయాన్ని ఆలోచిస్తానని పేర్కొన్నాడు. అయితే, రాజకీయాల్లోకి రాకుండా కూడా సేవ చేయవచ్చని, అయితే, సేవకు రాజకీయాలు మంచి మార్గమని అన్నాడు. అభిమానులతో కలిసి సమాజసేవ చేసే విషయాన్ని ఆలోచిస్తున్నట్టు చెప్పాడు.

 బిగ్‌బాస్‌తో తెలుగు ప్రజల హృదయాలు గెలుచుకున్న కౌశల్‌ కోసం అప్పట్లో ఓ ఆర్మీ ఏర్పాటైంది. అతడు గెలవాలంటూ పూజలు, 2కే, 3కే రన్‌లు కూడా నిర్వహించారు. వాటిలో వేలాదిమంది పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అది ఫేక్ ఆర్మీ అంటూ బాబు గోగినేని వంటి వారు ఆరోపణలు కూడా చేశారు.
Kaushal
Big Boss
Kurnool District
Politics
Andhra Pradesh
Kaushal Army

More Telugu News