delhi: పట్టాలపై మద్యం తాగుతుండగా వచ్చిన రైలు.. ముగ్గురి మృతి!

షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీ-బికనీర్ రైల్వే మార్గంలో నంగ్లోయి రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం ఉదయం దుర్ఘటన జరిగింది. ఉదయం 7:15 నిమిషాల సమయంలో ముగ్గురు వ్యక్తుల పైనుంచి రైలు దూసుకెళ్లింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు వ్యక్తులు రైలు పట్టాలపై మద్యం తాగుతుండగా ఈ రైలు వారిపై నుంచి దూసుకుపోయినట్టు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న రైల్వే రక్షణ దళం, రైల్వే పోలీసులు, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. అయితే ప్రమాద సమయంలో ముగ్గురు వ్యక్తులు మద్యం తాగుతుండడం లేదా మద్యం మత్తులో పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని స్థానిక రైల్వే డీసీపీ దినేష్ గుప్తా అనుమానం వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన అసలు కారణాలు తెలియరాలేదని దుప్తా వెల్లడించారు. ప్రమాద సమయానికే ముగ్గురు వ్యక్తులు విపరీతమైన మద్యం మత్తులో ఉన్నారని తెలిపారు.
Go Back to Shorts
delhi
bikanir
nangloi

More Telugu News