Shivaji: శివాజీయే దాడికి ప్లాన్ చేశారేమో.. ముందు ఆయన్ను విచారించాలి: విష్ణు కుమార్ రాజు
- పోలీసులు ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు
- శివాజీ ఏమైనా జ్యోతిష్యుడా?
- దాడి ఘటనంతా పథకం ప్రకారమే జరిగింది
ఆపరేషన్ గరుడ విషయంలో పోలీసులు ఎందుకు పట్టనట్టు వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణు కుమార్ రాజు ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'శివాజీ ఏమైనా జ్యోతిష్యుడా? అసలు ఆయనే దాడికి ప్లాన్ చేశారేమో' అనే అనుమానం వ్యక్తం చేశారు.
మొదట పోలీసులు శివాజీని విచారించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పోలీసులపై నమ్మకం లేదన్న జగన్ వ్యాఖ్యలను విష్ణుకుమార్ రాజు ఖండించారు. ముందే లేఖ రాసుకుని మరీ దాడి జరిపాడంటే ఇదంతా ఓ పథకం ప్రకారమే జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక ఎవరున్నారో నిజానిజాలు తేల్చాలన్నారు.