Revanth Reddy: రేవంత్ రెడ్డికి భద్రత పెంచండి: కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

షార్ట్స్‌లో చూడండి
టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి భద్రత పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఉత్తర్వులు జారీ చేసింది. భద్రత ఖర్చును రేవంత్ రెడ్డి భరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ఇదిలావుండగా నలుగురు కేంద్ర సిబ్బందితో నిరంతరం తనకు భద్రత కల్పించాలని కోరుతూ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రప్రభుత్వం, కేసీఆర్‌పై పోరాడుతున్న తనకు ప్రాణహాని ఉందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం కావడంతో రాష్ట్ర ప్రభుత్వంపై తనకు నమ్మకం లేదని,  4ప్లస్4 భద్రత కావాలంటూ ఈసీని, కేంద్రాన్ని కోరారు. స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆయన ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న హైకోర్టు ఆయన కోరిన విధంగా భద్రతను కల్పించడంపై ఈ తీర్పునిచ్చింది.
Go Back to Shorts
Revanth Reddy
Telugudesam
High Court

More Telugu News