jagan: జగన్ పై దాడి కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా!

  • కేసును స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలంటూ పిటిషన్
  • పిటిషన్ వేసిన వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి
  • విచారణను బుధవారానికి వాయిదా వేసిన హైకోర్టు
వైసీపీ అధినేత జగన్ పై దాడికి సంబంధించి దాఖలైన పిటిషన్ విచారణను ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు వాయిదా వేసింది. రాష్ట్ర పోలీసులపై తమకు నమ్మకం లేదని... దాడి కేసును స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశించాలని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణను బుధవారానికి హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు, కేంద్ర సంస్థలతో కేసు విచారణ జరిపించాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి వైసీపీ నేతలు కోరిన సంగతి తెలిసిందే.
jagan
YV Subba Reddy
High Court

More Telugu News