krishanamraju: మా నాన్నకి అబద్ధం చెప్పేవాడిని కాదు: కృష్ణంరాజు

  • ఇండస్ట్రీకి మా నాన్నే పంపించారు 
  • ఎంతమంది వద్దన్నా వినిపించుకోలేదు
  • ఆయన నమ్మకాన్ని నిలబెట్టాను    
గంభీరమైన రూపం .. అందుకు తగిన వాయిస్ కృష్ణంరాజు సొంతం. అవే ఆయనకు కొన్ని ప్రత్యేకమైన పాత్రలను .. పేరు ప్రతిష్ఠలను తెచ్చిపెట్టాయి. అలాంటి కృష్ణంరాజు ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. నాకు 18 యేళ్లు వచ్చిన దగ్గర నుంచి మా నాన్న నన్ను ఒక స్నేహితుడు మాదిరిగానే చూశారు. ఒక స్నేహితుడులానే నన్ను చిత్రపరిశ్రమకి పంపించారు.

ఈ విషయంలో ఆయనను వారించడానికి చాలామంది ప్రయత్నించినా వినిపించుకోలేదు. నాపై ఎంతో నమ్మకం పెట్టుకుని ఆయన పంపించారు. అందువలన ఆయనకి ఒక్క అబద్ధం కూడా చెప్పేవాడిని కాదు. ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో నా పరిస్థితిని గురించి చెబుతూ ఎదుగుతూ వచ్చాను. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననే నేను అనుకుంటున్నాను" అని చెప్పుకొచ్చారు
krishanamraju

More Telugu News