krisnamraju: నేను ధైర్యంగా మాట్లాడటం అక్కినేనికి నచ్చింది: కృష్ణంరాజు

  • ఏఎన్నార్ అంటే నాకు చాలా ఇష్టం 
  • ఆయనతో 'బుద్ధిమంతుడు' చేశాను 
  • క్లైమాక్స్ గురించి ఏఎన్నార్ ను అడిగాను
తెలుగు తెరపై ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన కృష్ణరాజు, 'రెబల్ స్టార్' గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "అక్కినేని నాగేశ్వరరావు గారంటే నాకు చాలా ఇష్టం. ఆయన సిగరెట్ తాగే తీరు .. షర్ట్ హ్యాండ్స్ పైకి మలిచే స్టైల్ అంటే నాకెంతో ఇష్టం. ఆయనను ఇమిటేట్ చేస్తూ ఉండేవాడిని.

ఆయనతో కలిసి 'బుద్ధిమంతుడు' సినిమా చేశాను. అప్పట్లో ఆయనతో మాట్లాడాలంటేనే చాలామంది భయపడేవారు. అలాంటిది ఆయన 'బుద్ధిమంతుడు' సినిమా గురించి నన్ను అడిగారు. అప్పుడు నేను .. " క్లైమాక్స్ లో మీరు .. నేను ఫైట్ చేసుకుంటూ ఎంతో దూరం వెళ్లిపోయినట్టు చూపించారు. తీరా అక్కడికి ఒక చిన్న కుర్రాడు వచ్చి, గుళ్లో జరుగుతోన్న విషయాన్ని గురించి చెబుతాడు. ఇదెలా సాధ్యమని మీరు దర్శకుడిని ఎందుకు అడగలేదు?" అని నేను అక్కినేనితో అన్నాను. నేను ఆ విషయం గురించి అలా ధైర్యంగా మాట్లాడిన దగ్గర నుంచి ఆయన నాపై ఎక్కువ అభిమానం చూపేవారు" అని చెప్పుకొచ్చారు.      
krisnamraju
akkineni

More Telugu News