ఇండోనేషియాలో కూలిన విమానానికి కెప్టెన్ భారతీయుడే!
- ప్రమాద సమయంలో విమానాన్ని నడుపుతున్న సునేజా
- ఢిల్లీలో పోస్టింగ్ కోసం పలుమార్లు విన్నపం
- 2011లో లయన్ ఎయిర్‌లో చేరిక
ఢిల్లీకి చెందిన సునేజా మయూర్ విహార్ నివాసి. మార్చి 2011లో ఇండోనేషియాకు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ లయన్ ఎయిర్‌లో చేరారు. బోయింగ్ 737 విమానాన్ని నడుపుతున్న సునేజా త్వరలోనే భారత్ రావాల్సి ఉంది. తనకు ఢిల్లీలో పోస్టింగ్ ఇవ్వాల్సిందిగా పలుమార్లు సంస్థను అభ్యర్థించినట్టు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఏడాది పాటు ఇక్కడ పనిచేసిన తర్వాత ఢిల్లీ పోస్టింగ్ ఇస్తామని అతడికి చెప్పినట్టు ఆయన పేర్కొన్నారు. సునేజా సహా విమానంలో ఉన్న వారందరూ క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.