Khammam: ఖమ్మం కమాన్‌ బజార్‌లో భారీ అగ్నిప్రమాదం... పేలుళ్లు!

  • కుప్పకూలిన రెండతస్తుల భవనం
  • ధ్వంసమైన ఇళ్లు, దుకాణాలు
  • భయంతో వణికిపోయిన జనం
ఖమ్మం పట్టణంలోని కమాన్‌ బజార్‌లో నేటి తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. పేలుళ్లు చోటు చేసుకున్నాయి. బజార్‌లోని రెండతస్తుల భవనంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో భవనం కుప్పకూలింది. చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు కూడా ధ్వంసంకాగా ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పేలుడు శబ్దానికి దుకాణాల షట్టర్లు ఎగిరి పడ్డాయి. చుట్టుపక్కల ఇళ్లు కూడా దెబ్బతినడంతో స్థానికులు హడలిపోయారు. ఘటనా స్థలి వద్ద భయానక వాతావరణం నెలకొంది. ప్రమాదానికి కారణాలు పూర్తిగా తెలియరాలేదు.  
Khammam
kaman bajar
Fire Accident

More Telugu News