Congress: తుది దశలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ముకుల్ వాస్నిక్ ఆమోద ముద్రతో వెల్లడి

  • ఎంపిక ప్రక్రియలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం
  • శక్తి యాప్ ద్వారా వాయిస్ మెయిల్
  • 2.20 లక్షల మంది అభిప్రాయాల వెల్లడి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ ఆర్సీ కుంతియా తెలిపారు. ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌ ముకుల్‌ వాస్నిక్‌ దీనిని పరిశీలించి ఆమోదముద్ర వేసిన తరువాత జాబితాను వెల్లడించే అవకాశం ఉంది.

ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ విషయంలో కాంగ్రెస్ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్టు తెలుస్తోంది. శక్తి యాప్ ద్వారా 4.50 లక్షల మందికి వాయిస్ మెయిల్ పంపి అభ్యర్థుల ఎంపికపై అభిప్రాయాన్ని కోరగా.. 2.20 లక్షల మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గానికి ఒకే అభ్యర్థి పేరు సూచించాలని యాప్ ద్వారా కుంతియా కోరారు. తాజాగా ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో అభ్యర్థి పేరుతో జాబితా తయారు చేశారు.
Congress
RC Kunthiya
Telangana
Mukul vasnik
Shakthi AAP

More Telugu News