కోడి కత్తిని ఎవరు తీసుకెళ్లారు.. రక్తపు మరకలు లేకుండా ఎవరు చేశారు?: దేవినేని ఉమ
- దాడిపై పోలీసులకు జగన్ ఎందుకు ఫిర్యాదు చేయలేదు?
- జగన్ బయటకు వచ్చి నోరు విప్పాలి
- పోలవరం ప్రాజెక్టును బీజేపీ అడ్డుకుంటోంది
వైసీపీ నేతలు నీచ రాజకీయాలకు తెగబడుతున్నారని ఉమ విమర్శించారు. వైసీపీ నేతలను బీజేపీ నేతలే రాష్ట్రపతి, కేంద్ర మంత్రుల వద్దకు పంపుతున్నారని దుయ్యబట్టారు. దాడి జరిగిన వెంటనే విశాఖపట్నంలోని ఆసుపత్రిలో జగన్ ఎందుకు చేరలేదని... పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని... రూ. 3,150 కోట్ల బకాయిలను కూడా చెల్లించలేదని మండిపడ్డారు. డీపీఆర్-2ను వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేశారు.