Kondala Rao: భర్త మృతిని తట్టుకోలేక.. పిల్లలతో కలిసి ఆత్మహత్యాయత్నం

  • గుండెపోటుతో మృతి చెందిన కొండలరావు
  • ఆత్మహత్యాయత్నం చేసిన సుజాత, పిల్లలు
  • పెద్ద కుమార్తె మృతి.. ఇద్దరి పరిస్థితి విషమం
భర్త గుండెపోటుతో మరణించడాన్ని తట్టుకోలేక పోయిన భార్య తన పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. నగరంలోని రంగనాయకుల పేటలో నివాసముంటున్న కొండలరావు.. హైదరాబాద్‌లో గుండెపోటుతో మృతి చెందారు.

విషయం తెలుసుకున్న అతని భార్య సుజాత తన ఇద్దరు పిల్లలు విష్ణువర్థిని(12), దివ్యాసోని(10)లతో కలిసి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఘటనలో పెద్ద కుమార్తె విష్ణువర్థిని మృతి చెందగా, సుజాత, దివ్యాసోనిల పరిస్థితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Kondala Rao
Sujatha
Divya Soni
Vishnu vardhini
Suicide Attempt

More Telugu News