YV Subba Reddy: పాదయాత్రలో దాడి చేస్తే జనం తిరగబడతారనే భయంతోనే ఎయిర్‌పోర్టులో దాడి!: వైవీ సుబ్బారెడ్డి

  • చంద్రబాబు హత్యారాజకీయాలకు పాల్పడుతున్నారు
  • జగన్‌పై హత్యాయత్నం వెనుక టీడీపీ హస్తం
  • తుపాను బాధితులకు కేంద్రం సాయమందించాలి
టీడీపీ, వైసీపీల ఆరోపణలు, ప్రత్యారోపణలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నేడు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీపై విమర్శలు గుప్పించారు. వైసీపీ అధినేత జగన్‌పై పాదయాత్రలో దాడి చేస్తే జనం తిరగబడతారనే భయంతో.. ఎయిర్‌పోర్టులో దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

జగన్‌పై హత్యాయత్నం వెనుక టీడీపీ హస్తం ఉందని.. చంద్రబాబు హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎయిర్‌పోర్టులో శాంతి భద్రతల పరిరక్షణ అంతా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తుపాను సహాయక చర్యల్లో సైతం ప్రభుత్వం విఫలమైందని.. బాధితులకు కేంద్రం సాయం అందించాలని ఆయన కోరారు.
YV Subba Reddy
Jagan
Chandrababu
Airport
Telugudesam

More Telugu News