TRS: హైదరాబాదులోని ఆంధ్రులకు అన్ని రకాలుగా అండగా ఉంటాం: కేటీఆర్

  • రాష్ట్రం ఏర్పడటం వల్లే తెలంగాణకు గౌరవం దక్కింది
  • హైదరాబాదులో 5 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం
  • టీఆర్ఎస్ ఓట్ల శాతం అనూహ్యంగా పెరుగుతోంది
రాష్ట్రంలో టీఆర్ఎస్ ఓట్ల శాతం అనూహ్యంగా పెరుగుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నిజాంపేటలో నిర్వహించిన 'హమారా హైదరాబాద్' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం ఏర్పడటం వల్లే తెలంగాణకు గౌరవం దక్కిందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలకు నిజమైన గౌరవం, గుర్తింపు దక్కాయని అన్నారు. తెలంగాణ ఏర్పడేంత వరకే గొడవ జరిగిందని... గత నాలుగేళ్లలో చిన్న గొడవ కూడా జరగలేదని చెప్పారు. హైదరాబాదులో 5 లక్షలకు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. హైదరాబాదులో నివసిస్తున్న ఆంధ్ర ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఈ నాలుగేళ్లలో ఉన్నంత భద్రతగా గత 67 ఏళ్లలో హైదరాబాద్ లేదని చెప్పారు. మహిళలకు భద్రత పెరిగిందని అన్నారు.
TRS
KTR
hamara hyderabad
andhra

More Telugu News