Ganja: గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన జూనియర్ ఆర్టిస్ట్

  • సీరియళ్లలో జూనియర్ ఆర్టిస్టుగా నటిస్తున్న సాయికుమార్
  • అరకు నుంచి గంజాయి దిగుమతి
  • నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా
గంజాయి స్మగ్లింగ్ చేస్తూ బుల్లితెర జూనియర్ ఆర్టిస్టు పోలీసులకు పట్టుబడ్డాడు. బాగ్ అంబర్‌పేటకు చెందిన రెడ్డి వేద సాయికుమార్ (23) తెలుగు సీరియళ్లలో జూనియర్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడు.

విశాఖపట్టణంలోని అరకు కేంద్రంగా మణి, అభిషేక్ అనే ఇద్దరు స్మగ్లర్ల సాయంతో గంజాయిని దిగుమతి చేసుకుంటున్న సాయికుమార్ వాటిని నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యార్థులు, స్నేహితులకు సరఫరా చేస్తున్నాడు. శనివారం బాగ్ అంబర్‌పేటలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో సాయికుమార్ గంజాయితో పట్టుబడ్డాడు. అతడి నుంచి పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Ganja
Hyderabad
Araku
smuggling
Junior Artist

More Telugu News