Chandrababu: చంద్రబాబుకు ఏపీ జర్నలిస్ట్ అసోసియేషన్ కృతజ్ఞతలు

  • జర్నలిస్టులకు 25 ఎకరాలు కేటాయించిన ఏపీ ప్రభుత్వం
  • హర్షం వ్యక్తం చేసిన జర్నలిస్టులు
  • ఢిల్లీలో చంద్రబాబుకు చిరు సత్కారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి ఏపీ జర్నలిస్టు అసోసియేషన్-ఢిల్లీ (ఆజాద్) ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఢిల్లీ వచ్చిన ముఖ్యమంత్రిని కలిసిన జర్నలిస్టులు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి సత్కరించారు. అమరావతి అక్రిడిటేటెడ్ జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి ఏపీ ప్రభుత్వం 25 ఎకరాలు కేటాయిస్తూ సిఫారసు చేసింది. జర్నలిస్టుల కోసం భూమి కేటాయించడంపై జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీ వచ్చిన సీఎం చంద్రబాబును ఆజాద్ అధ్యక్షుడు మందడపు కృష్ణ నేతృత్వంలోని ప్రతినిధులు కలిసి కృతజ్ఞతలు తెలిపి సత్కరించారు.
Chandrababu
Andhra Pradesh
Journalists
New Delhi

More Telugu News