Narayana: గుండెనొప్పిని భరిస్తూ ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చి.. ఆర్టీసీ డ్రైవర్ మృతి

  • అరకు నుంచి పాడేరుకు బయల్దేరిన బస్సు
  • బస్సులో 50 మంది ప్రయాణికులు
  • డ్యూటీ దిగి కుప్పకూలిన నారాయణ
ఓ వైపు గుండె నొప్పితో బాధపడుతూనే ప్రయాణికులను గమ్య స్థానానికి చేర్చి తాను మాత్రం తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడు ఓ డ్రైవర్. పాడేరు ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న నారాయణ, అరకు నుంచి పాడేరు బస్సుకు డ్రైవర్‌గా డ్యూటీకి ఎక్కాడు. శనివారం మధ్యాహ్నం అరకు నుంచి బస్సు బయల్దేరింది.

మార్గమధ్యంలో ఆయనకు గుండెలో నొప్పి వచ్చింది. బస్సులో 50 మంది వరకూ ప్రయాణికులున్నారు. దీంతో బస్సును పాడేరు చేర్చి డ్యూటీ నుంచి దిగుతున్నట్టు సంతకం చేసి బయటకు వచ్చి కుప్పకూలిపోయాడు. వెంటనే సహోద్యోగులు ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
Narayana
Heart Atalk
Paderu
Araku
Bus Driver

More Telugu News