Mayavathi: చంద్రబాబుకు సాదర స్వాగతం పలికిన మాయావతి.. ప్రాంతీయ పార్టీలు బలపడాలని ఆకాంక్ష

  • ప్రాంతీయ పార్టీలు బలపడాలన్న మాయావతి
  • కాంగ్రెస్‌తో విభేదించడంపై ప్రత్యేక చర్చ
  • కారు దాకా వచ్చి సాగనంపిన మాయావతి
బీఎస్పీ అధినేత్రి మాయావతితో నేడు ఏపీ సీఎం చంద్రబాబు భేటి అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు మాయవతి సాదర స్వాగతం పలికారు. ప్రాంతీయ పార్టీలు బలపడి అధికారాన్ని చేజిక్కించుకోగలిగితేనే నియంతృత్వాన్ని అడ్డుకోగలమని ఆమె స్పష్టం చేశారు.

ఈ భేటీలో ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో బీఎస్పీ విభేదించడంపై చంద్రబాబు ప్రత్యేకంగా చర్చించినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో కలిసి పనిచేద్దామని చంద్రబాబుకు మాయావతి చెప్పినట్టు సమాచారం. భేటి అనంతరం కూడా చంద్రబాబును ఆమె కారు దాకా వచ్చి సాగనంపినట్టు తెలుస్తోంది.
Mayavathi
Chandrababu
Local Parties
BSP
Congress

More Telugu News