ఏపీ, తెలంగాణాల్లో కుటుంబపాలన సాగుతోంది: కేంద్ర మంత్రి గడ్కరీ విమర్శలు
- ఈ రాష్ట్రాల్లో పేదల కోసం పాటుపడే ప్రభుత్వాలు లేవు
- పేదల కోసం మోదీ సర్కార్ పలు పథకాలు తెచ్చింది
- నదుల అనుసంధానం కోసం కేంద్రం కృషి చేస్తోంది
పేదల కోసం మోదీ సర్కార్ అనేక పథకాలు తీసుకొచ్చిందని, రూ.70 వేల కోట్లతో పోలవరం ప్రాజెక్ట్ ను నిర్మిస్తోందని అన్నారు. అలానే, కాళేశ్వరం ప్రాజెక్ట్ కు కూడా కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామని, వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, హైవే గ్రిడ్ పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. నదుల అనుసంధానం కోసం కేంద్రం కృషి చేస్తోందని, దేశ వ్యాప్తంగా లక్షల ఎకరాలకు కొత్తగా నీరు అందిస్తున్నామని, దేశంలో విద్యుత్ కొరత లేకుండా చేశామని చెప్పారు.