వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త ఫీచర్లు!

షార్ట్స్‌లో చూడండి
‘ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్’ వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. రెండు కొత్త ఫీచర్లను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ కు వచ్చిన యూట్యాబ్, ఫేస్ బుక్, తదితర సైట్ల లింక్ ల ద్వారా వీడియోలు చూసేందుకు ఇకపై వాట్సాప్ ను వదిలిపెట్టాల్సిన పనిలేదు. వాట్సాప్ లో చాటింగ్ చేస్తూనే మరో విండోలో తమకు వచ్చిన వీడియోలను ‘పిక్చర్ ఇన్ పిక్చర్’ తరహాలో చూడవచ్చు.  

రెండో ఫీచర్.. ఇప్పటివరకూ వాట్సాప్ లో ఏ మెసేజ్ కు అయినా రిప్లై ఇవ్వాలంటే మెసేజ్ పై హోల్డ్ చేసి పట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై అలాంటి ఇబ్బంది పడాల్సిన పనిలేదు. ఎందుకంటే.. మెసేజ్ పై సింపుల్ గా స్వైప్ చేస్తే చాలు.. సులభంగా మెసేజులకు రిప్లై ఇవ్చొచు. అయితే ఈ రెండు కొత్త ఫీచర్లు ఇప్పటికే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చాయి.
Go Back to Shorts
what`sup
android
new features

More Telugu News