Dokka: ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యపై స్పందించకుండా జగన్ పై దాడిపై గవర్నర్ స్పందించారు : టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా

  • రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు
  • ఏపీ పోలీసులపై జగన్ నమ్మకం లేదనడం దురదృష్టకరం
  • దాడి తర్వాత హైదరాబాద్ ఎందుకు వెళ్లారని ప్రశ్న
జగన్ పై వైజాగ్ ఎయిర్ పోర్టులో దాడి, అనంతర పరిణామాలపై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను హత్య చేస్తే స్పందించని గవర్నర్ జగన్ పై దాడి జరిగితే వెంటనే స్పందించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దెబ్బ తీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఏపీ పోలీసులపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. జగన్ పై జరిగిన దాడిని రాష్ట్రప్రభుత్వం ఖండించిందని, సీరియస్ గా తీసుకొని విచారణ జరుపుతోందన్నారు. ఏపీ పోలీసులకు సహకరించకుండా నమ్మకం లేదని జగన్ వ్యాఖ్యానించడం దురదృష్టకరమన్నారు. దాడి జరిగిన తర్వాత విశాఖపట్నంలో వైద్యం చేయించుకోకుండా హైదరాబాద్ ఎందుకు వెళ్లారని జగన్ ను ఆయన ప్రశ్నించారు.
Dokka
Telugudesam
Jagan
YSRCP

More Telugu News