Rakhi Sawant: 99 శాతం హీరోయిన్లు అందుకు అంగీకరించే వస్తారు: రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యల వీడియో

  • అవకాశాల కోసం క్యాస్టింగ్ డైరెక్టర్ల వలలో పడతారు
  • సెక్స్ కు అంగీకరించే వస్తారు
  • అత్యాచారాలు, బలవంతం ఉండదు
  • మగవాళ్లు జాగ్రత్తగా ఉండాలన్న రాఖీ సావంత్
సినిమా పరిశ్రమలో 99 శాతం మంది హీరోయిన్లు, నిర్మాతలు తదితరులతో సెక్స్ కు అంగీకరించే వస్తారని నటి రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, మరిన్ని అవకాశాలు ఇస్తారన్న ఉద్దేశంతోనే మహిళలు తమంతట తాముగా అంగీకరించే పడకగదికి వస్తారని, ఈ విషయంలో వారిని భయపెట్టేవారు, బలవంతం చేసేవారు, అత్యాచారాలకు పాల్పడేవారు ఎవరూ ఉండరని చెప్పింది.

మహిళలను లైంగికంగా వాడుకునే విషయంలో క్యాస్టింగ్ డైరెక్టరకు బాధ్యత ఉంటుందని, సినిమా అవకాశాల కోసం వచ్చేవారు తొలుత వీరి వలలోనే పడతారని వెల్లడించింది. ఈ విషయంలో మగవారు ఆడవాళ్ల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని, ఒకసారి పడకగదికి వచ్చిన అమ్మాయి, ఆపై వారిని బెదిరించి, బ్లాక్ మెయిల్ కు కూడా దిగవచ్చని రాఖీ సావంత్ హెచ్చరించింది. ఆమె మాటల వీడియోను మీరూ చూడవచ్చు.
Rakhi Sawant
Interview
Casting Couch
Bollywood

More Telugu News