Hyderabad: ఖైరతాబాద్ నడిరోడ్డుపై బీభత్సం సృష్టించిన కారు!

  • ఫ్లయ్ ఓవర్ పై అదుపుతప్పిన కారు
  • దంపతులకు తీవ్రగాయాలు
  • వెంటనే స్పందించిన స్థానికులు
నిత్యమూ అత్యంత రద్దీగా ఉండే ఖైరతాబాద్ చౌరస్తాలో ఓ కారు బీభత్సం సృష్టించగా, గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎర్రమంజిల్ వైపు నుంచి వేగంగా వచ్చిన కారు, నక్లెస్ రోడ్డు ఫ్లయ్ ఓవర్ పై అదుపుతప్పి, డివైడర్ ను ఢీకొని అవతలివైపు పడిపోయింది. కారులో దంపతులు ప్రయాణిస్తుండగా, వారికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాదం ఉదయం 7 గంటల సమయంలో జరగడం, ఆ సమయంలో అవతలివైపు నుంచి ఎటువైపు నుంచి మరే ఇతర వాహనాలూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మార్నింగ్ వాక్ కు వచ్చినవారు వెంటనే స్పందించి, గాయపడిన వారిని కారు నుంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని సందర్శించి, కేసు నమోదు చేశారు.
Hyderabad
Khairatabad
Police
Road Accident

More Telugu News