Bihar: రోడ్డు ప్రమాదంలో ఎంపీ వీణాదేవి కుమారుడు దుర్మరణం!

  • నోయిడా ఎక్స్ ప్రెస్ హైవేపై ప్రమాదం
  • అతి వేగమే కారణమని సమాచారం
  • శోకసంద్రంలో వీణాదేవి కుటుంబం
బీహార్ లోక్ జనశక్తి పార్లమెంట్ సభ్యురాలు వీణాదేవి కుమారుడు అశుతోష్ సింగ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, యూపీలోని నోయిడా ఎక్స్ ప్రెస్ హైవేపై అశుతోష్, తన వాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని సమాచారం.

మాజీ ఎంపీ సూరజ్ ఖాన్ భార్య వీణాదేవి కాగా, ఆమె ప్రస్తుతం ముంగేర్ ఎంపీగా ఉన్నారు. ఈ ఘటనతో వీణాదేవి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వీణాదేవి దంపతులను పలువురు రాజకీయ నేతలు పరామర్శించి, సంతాపం తెలిపారు. కాగా, గతంలో ఇదే పార్టీకి చెందిన మరో ఎంపీ రామ్ సింగ్ కుమారుడు కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతిచెందారు.
Bihar
Veenadevi
Munger
Son
Ashutosh
Road Accident

More Telugu News