Jagan: జగన్ పై కోర్టును ఆశ్రయించాలని విశాఖ పోలీసుల నిర్ణయం!

  • స్టేట్ మెంట్ కోసం అధికారులను పంపించాం
  • వాంగ్మూలం ఇచ్చేందుకు జగన్ నిరాకరించారు
  • కోర్టును ఆశ్రయించే విషయంలో న్యాయ సలహా తీసుకుంటాం
  • విశాఖ నగర కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా
విపక్ష నేత వైఎస్ జగన్ పై దాడి అనంతరం, తాను కొందరు అధికారులను హైదరాబాద్ పంపించి, జగన్ స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని ఆదేశించానని, అయితే, వారికి జగన్ సహకరించలేదని విశాఖ నగర పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడాలంటే, బాధితుడి వాంగ్మూలం తప్పనిసరని వ్యాఖ్యానించిన ఆయన, కోర్టును ఆశ్రయించి, జగన్ స్టేట్ మెంట్ ను తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. జగన్, తన వాంగ్మూలాన్ని ఇవ్వకుంటే నిందితుడు తప్పించుకునే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కోర్టును ఆశ్రయించే విషయంలో న్యాయ నిపుణుల సలహాను తీసుకుంటున్నామని అన్నారు.
Jagan
Police
Court
Vizag

More Telugu News