West Godavari District: ఢీకొన్న నారాయణ స్కూల్, కాలేజీ బస్సులు!
- పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఘటన
- 15 మంది విద్యార్థులకు గాయాలు
- అతివేగమే కారణమంటున్న ప్రత్యక్ష సాక్షులు
నారాయణ విద్యాసంస్థలకు చెందిన రెండు బస్సులు ఢీకొన్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్ టౌన్ లో కలకలం రేపింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఈ ఉదయం విద్యార్థులను పాఠశాల, కాలేజీలకు తీసుకెళుతున్న నారాయణ స్కూల్, కాలేజీలకు చెందిన బస్సులు పరస్పరం ఢీకొన్నాయి.
వేగంగా వస్తున్న రెండు బస్సులూ ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. గాయపడిన పాఠశాల విద్యార్థుల్లో అత్యధికులు దిరుసుమర్రు గ్రామానికి చెందినవారుగా తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని, గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలుసుకున్న దిరుసుమర్రు విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్దకు పెద్దఎత్తున చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.