India: వీళ్ల వల్ల కాదని తేలిపోయి, వారిని తెచ్చారు... ఇదే తమ విజయమంటున్న వెస్టిండీస్!

  • తొలి వన్డేలో ఓటమి పాలై, రెండో వన్డేను డ్రా చేసుకున్న వెస్టిండీస్
  • చివరి మూడు వన్డేలకూ బుమ్రా, భువీలకు పిలుపు
  • స్పందించిన స్టువర్ట్ లా
ఇండియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా, తొలి వన్డేలో ఓటమి పాలై, రెండో వన్డేను డ్రా చేసుకున్న వెస్టిండీస్, ఇప్పుడు మరో రకంగా ఆనందపడుతోంది. తాము భారత జట్టు విశ్రాంతి ఇచ్చిన ప్రధాన బౌలర్లను తిరిగి జట్టులోకి తీసుకునేలా చేశామని, ఇది తమ విజయమేనని చెబుతోంది. వెస్టిండీస్ తో చివరి మూడు వన్డేలకు పేస్ బౌలర్లు భువనేశ్వర్, జస్ ప్రీత్ బుమ్రాలను భారత జట్టు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ తొలి రెండు వన్డేల్లో విశ్రాంతినిచ్చారు.

ఇక వీరిని తీసుకోవడంతో భారత బౌలింగ్ లైనప్ మరింత బలోపేతం కాగా, వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా స్పందించాడు. తమ బలాన్ని చూసి భారత్, తన ప్రధాన బౌలర్లను తిరిగి తీసుకొచ్చిందని ఆయన అన్నాడు. తొలి మ్యాచ్ లో భారత బౌలర్లు 320 పరుగులు సమర్పించుకున్నారని గుర్తు చేసిన ఆయన, ఆత్మరక్షణలో పడిన టీమిండియా, మరోసారి అదే పరిస్థితి రాకూడదన్న ఆలోచనలోనే భువి, బుమ్రాలను జట్టులోకి తీసుకు వచ్చిందని, వారిని తమ ఆటగాళ్లు సమర్థవంతంగా ఎదుర్కోగలరని అన్నాడు.
India
Westindees
Cricket
Bhuvaneshwar
Bumrah

More Telugu News