Chandrababu: తిత్లీ తుపాను బాధితులకు తెలంగాణ టీడీపీ నాయకుడి భారీ విరాళం

  • తుపాను బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన మొవ్వా సత్యనారాయణ
  • సీఎం సహాయనిధికి రూ.11 లక్షల విరాళం
  • కడియాల సుబ్బారావు రూ.లక్ష విరాళం
తిత్లీ తుపాను బాధితులకు తెలంగాణ టీడీపీ నేత మొవ్వా సత్యనారాయణ ఆర్థిక సాయం అందించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ నేత అయిన ఆయన శుక్రవారం అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి సీఎం సహాయనిధికి రూ.11,11,111 అందించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. తిత్లీ తుపాను కష్టాలు తనను కదిలించి వేశాయన్నారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసమే టీడీపీ ఆవిర్భవించిందన్నారు. తెలుగువారు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా టీడీపీ వారిని ఆదుకుంటుందన్నారు. కాగా, కూకట్‌పల్లికి చెందిన కడియాల సుబ్బారావు తిత్లీ తుపాను బాధితులకు లక్ష రూపాయల విరాళం ఇచ్చారు. ఈ మేరకు చంద్రబాబును కలిసి చెక్కు అందించారు.
Chandrababu
Movva satyanarayana
Kadiyala subbarao
Titli cyclone
Srikakulam District
Telangana

More Telugu News