vijaya sai reddy: విజయసాయిరెడ్డి కూడా కాపీ కొట్టే సీఏ ఎగ్జామ్స్ పాసయ్యారా?: పోలీస్ అధికారుల సంఘం

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై దాడి విచారణకు సంబంధించి ఏపీ డీజీపీ ఠాకూర్ సరిగ్గా వ్యవహరించలేదని, కాపీ కొట్టి ఐపీఎస్ ఎగ్జామ్ ఆయన పాసయ్యారేమోనంటూ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం మండిపడుతోంది. ఈ వ్యాఖ్యలను విజయసాయి తక్షణం వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

 పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, విజయసాయిరెడ్డి కూడా కాపీ కొట్టే  సీఏ ఎగ్జామ్స్ పాసయ్యారా? అని ప్రశ్నించారు. ఏ చిన్న సంఘటన జరిగినా పోలీసులపై ఆరోపణలు చేయడం ఆయనకు అలవాటైపోయిందని, ఇది మంచి పద్ధతి కాదని, అన్ని విషయాల్లోకి పోలీసులను లాగొద్దని హెచ్చరించారు.

ఎంపీగా ఉన్న విజయసాయి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, డీజీపీపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులను వైఎస్ జగన్ కంట్రోల్ చేయాలని గట్టిగా హెచ్చరిస్తున్నామని చెప్పారు. 
Go Back to Shorts
vijaya sai reddy
police officers
ap dgp

More Telugu News