Jagan: జగన్‌పై కావాలనే దాడి చేశాడు.. కీలక విషయాలను వెల్లడించిన విశాఖ పోలీస్ కమిషనర్!

  • శ్రీనివాసరావును కోర్టులో ప్రవేశపెట్టాం
  • స్వగ్రామంలో ఒక గొడవ కేసు
  • దాడి చేసిన కత్తితో పాటు మరో చిన్న కత్తి
ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి కేసుకు సంబంధించి కొన్ని కీలక విషయాలను విశాఖ సీపీ మహేష్ చంద్ర లడ్డా మీడియాకు వివరించారు. జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావును కోర్టులో ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. శ్రీనివాసరావు కావాలనే దాడికి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్నారు. నిందితుడి వద్ద దాడి చేసిన కత్తితోపాటు మరో చిన్న కత్తి కూడా ఉందని.. దానిని కూడా స్వాధీనం చేసుకున్నామని లడ్డా వెల్లడించారు.

జనవరి నుంచి శ్రీనివాసరావు కత్తిని తన వద్దే ఉంచుకున్నాడని పేర్కొన్నారు. స్వగ్రామంలో కూడా ఓ గొడవ కేసు శ్రీనివాసరావుపై ఉందని స్పష్టం చేశారు. నిందితుడి దగ్గర లభ్యమైన లేఖలో కొన్ని పేజీలు అతని బంధువైన విజయలక్ష్మితోనూ.. మరికొన్ని పేజీలు రేవతిపతి అనే స్నేహితుడితోనూ రాయించాడని.. ఆఖరి పేజీలను మాత్రం తనే రాశాడని లడ్డా పేర్కొన్నారు.
Jagan
Mahesh Chandra Ladda
Srinivasa Rao
Court

More Telugu News