Abids: అబిడ్స్‌లోని హైస్కూల్లో అగ్ని ప్రమాదం.. ఏడుగురు విద్యార్థులకు అస్వస్థత

  • స్క్రాప్‌ రూమ్‌లో చెలరేగిన మంటలు
  • ప్రమాద సమయంలో 2 వేల మంది విద్యార్థులు
  • అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రిలో చికిత్స
స్కూల్లో చెలరేగిన మంటల కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో జరిగింది. అల్సెన్స్ హైస్కూల్లోని స్క్రాప్ రూమ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్కూలు యాజమాన్యం వెంటనే అప్రమత్తమై విద్యార్థులను బయటకు తీసుకొచ్చింది. అయితే దట్టమైన పొగ కారణంగా ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది కూడా సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్‌లో 2 వేల మంది విద్యార్థులున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Abids
Alsence
Students
Hyderabad

More Telugu News