ys jagan: జీవితకాల సీఎం కావాలని జగన్ తొందరపడుతున్నారు: జూపూడి ప్రభాకర్

  • జగన్ క్రిమినల్ మైండ్ తో రాజకీయ డ్రామాలు
  • సీబీఐతో విచారణ జరిపించాలనడం బీజేపీ, వైసీపీ కుట్ర
  • జగన్ ఘటనపై డీజీపీతో గవర్నర్ ఎలా మాట్లాడతారు?
వైఎస్ జగన్ క్రిమినల్ మైండ్ తో రాజకీయ డ్రామాలాడుతున్నారని, జీవితకాల సీఎం కావాలని తొందరపడుతున్నారని ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ విమర్శించారు. జగన్ పై దాడి ఘటనను సీబీఐతో విచారణ జరిపించాలనడం బీజేపీ, వైసీపీ కుట్ర అని అన్నారు. జగన్ తన అభిమానితో దాడి చేయించుకుని అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, జగన్ ఘటన గురించి డీజీపీతో ప్రత్యేకంగా గవర్నర్ ఎలా మాట్లాడతారు?  అని ప్రశ్నించారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని బీజేపీ, వైసీపీ కుట్ర పన్నుతున్నాయని దుయ్యబట్టారు.
ys jagan
jupudi
bjp

More Telugu News