Chandrababu: మామను చంపినవాడికి మానవ సంబంధాలుంటాయా?: చంద్రబాబుపై గట్టు రాంచందర్ రావు విమర్శలు

  • చంద్రబాబు అవకాశవాది
  • రాజకీయాలు తప్ప మరేమీ తెలియదు
  • తెలంగాణ లో పూర్తిగా, ఏపీలో సగం టీడీపీ కనుమరుగైంది
ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై టీఆర్ఎస్ కార్యదర్శి గట్టు రాంచందర్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మామను చంపిన వాడికి మానవసంబంధాలు ఉంటాయా? చంద్రబాబు అవకాశవాది, రాజకీయాలు తప్ప మరేమీ తెలియదని విమర్శించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల గురించి ఆయన ప్రస్తావించారు. తెలంగాణ లో పూర్తిగా, ఏపీలో సగం టీడీపీ కనుమరుగైందని అభిప్రాయపడ్డారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని అన్నారు. చంద్రబాబు కుట్రలు చేసే వ్యక్తి అని, ఆయనది విష కౌగిలి అని, చంద్రబాబు తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
Chandrababu
gattu ram chander
Telugudesam
TRS

More Telugu News