Roja: దాడి జరగగానే జగన్ హైదరాబాద్ కు బయలుదేరిన కారణమిదే: రోజా

  • అభిమానులు ఎమోషన్ లో ఏమైనా చేసుకోవచ్చు
  • అక్కడి నుంచి బయటపడితే పరిస్థితి సద్దుమణుగుతుందని భావించిన జగన్
  • చికిత్స వైజాగ్ లో తీసుకోని కారణాన్ని చెప్పిన రోజా
నిన్న తనపై కత్తితో దాడి తరువాత, ఎయిర్ పోర్టులో ప్రాథమిక చికిత్స అనంతరం, జగన్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, హైదరాబాద్ కు వచ్చిన విషయమై తెలుగుదేశం నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్న వేళ, వైకాపా మహిళా నేత రోజా స్పందించారు. ఒక బాధ్యతాయుతమైన విపక్ష నేతగా ఉన్న జగన్, తనపై జరిగిన దాడి గురించి తెలుసుకున్న కార్యకర్తలు, అభిమానులు ఎమోషన్ లో ఏదైనా చేసుకోవచ్చు లేదా ఏదైనా చేయచ్చన్న ఆలోచనతోనే, అక్కడి నుంచి బయట పడాలని జగన్ భావించారని రోజా తెలిపారు.

 అందువల్లే ఆయన అక్కడి నుంచి షెడ్యూల్ ప్రకారం విమానం ఎక్కాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. జగన్ తో ఉన్న కొందరు, ఇక్కడే ట్రీట్ మెంట్ తీసుకుందామని చెప్పినా, జగన్ సున్నితంగా తిరస్కరించి, ఆస్తినష్టం జరగరాదన్న ఉద్దేశంతో జగన్, ప్రయాణాన్ని కొనసాగిస్తే, తప్పుడు విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Roja
Jagan
YSRCP

More Telugu News