jagan: ఓ పిల్ల కుంకతో చంద్రబాబు ఈ హత్యకు కుట్ర చేశారా?: సోమిరెడ్డి

  • టీడీపీ పాలనలో ఫ్యాక్షన్ రాజకీయాలకు చోటు లేదు
  • మీ సినిమా ఫ్లాప్ అయింది
  • ఇకనైనా కుట్రలను ఆపేయాలి
రాష్ట్రంలో ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండకూడదనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని మంత్రి సోమిరెడ్డి అన్నారు. విశాఖపట్నంలో జగన్ కు కుట్లు వేసే డాక్టరే లేరా? కుట్లు వేయించుకునేందుకు హైదరాబాదు వరకు వెళ్లాలా? అని ఎద్దేవా చేశారు. మీ ప్లాన్లన్నీ ఫెయిల్ అయ్యాయని, మీ సినిమా ఫ్లాప్ అయిందని అన్నారు. జనాలకు సమాధానం చెప్పాల్సిన స్థితిలో వైసీపీ పడిందని చెప్పారు. పోలవరం, అమరావతి నిర్మాణాలను అడ్డుకోవడానికి ఇప్పటికే ఎంతో చేశారని... ఇప్పటికైనా అలాంటి కుట్రలను ఆపేయాలని సూచించారు.

డీజీపీ చేత ఓ కుర్రాడికి చంద్రబాబు కత్తిచ్చి పంపారని వైసీపీ నేతలు అంటున్నారని సోమిరెడ్డి మండిపడ్డారు. ఓ పిల్ల కుంకతో చంద్రబాబు ఈ హత్యకు కుట్ర చేశారని చెబుతున్నారా? అని ప్రశ్నించారు. ప్రస్తుత డీజీపీ వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ ల హయాంలో కూడా పని చేశారని గుర్తు చేశారు. ఇలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు టీడీపీ పాలనలో సాగవని అన్నారు.
jagan
somireddy chandramohan reddy
Chandrababu

More Telugu News