jagan: జగన్ కు కేవలం అర సెంటీమీటర్ గాయం మాత్రమే అయింది: డాక్టర్ స్వాతి ఆడియో లీక్

  • ఓ వ్యక్తికి వివరాలను వెల్లడించిన డాక్టర్ లలిత స్వాతి
  • సాధారణంగా కట్ అయినట్టే అయింది... కొంచెం రక్తస్రావం అయింది
  • జగన్ కు వైజాగ్ లో చికిత్స అందించిన స్వాతి
వైసీపీ అధినేత జగన్ కు చికిత్స అందిస్తున్న హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు... ఆయనకు మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతు వరకు గాయమైందని ప్రకటించారు. తొమ్మిది వరకు కుట్లు వేశామని చెప్పారు. మరోవైపు, విమానంలో జగన్ కు చికిత్స చేసిన అపోలో ఆసుపత్రి డాక్టర్ లలిత స్వాతి ఓ వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతూ... భుజానికి అర సెంటీమీటరు లోతున గాయమైందని తెలిపారు. సాధారణంగా కట్ అయినట్టే అయిందని, దీని వల్ల కొంచెం బ్లీడింగ్ అయిందని చెప్పారు. దీంతో, గాయం లోతుపై చర్చ మొదలైంది.
jagan
stab
lalitha swathi
wound
size
ysrcp
appolo

More Telugu News