Jagan: జగన్ ను విచారించేందుకు హైదరాబాద్ చేరుకున్న ఏపీ పోలీసులు!

  • డీసీపీ మహేంద్ర పాత్రుడు నేతృత్వంలో బృందం
  • జగన్ చెప్పే వివరాలు రికార్డు చేయనున్న పోలీసులు
  • ఉదయం 10 గంటల తరువాత విచారణ
నిన్న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన ఘటనలపై వైకాపా అధినేత వైఎస్ జగన్ ను విచారించి, ఆయన స్టేట్ మెంట్ ను నమోదు చేసుకునేందుకు ఏపీ పోలీసులు హైదరాబాద్ వచ్చారు. జగన్ పై జరిగిన దాడి విచారణకు ఏర్పాటు చేసిన సిట్ అధికారులు, ఈ తెల్లవారుజామున వచ్చారు. అడిషనల్ డీసీపీ మహేంద్ర పాత్రుడు నేతృత్వంలో డీఎస్పీ నాగేశ్వరరావు, మరో ఇద్దరు ఇనస్పెక్టర్ల బృందం వచ్చింది. హత్యాయత్నానికి సంబంధించి, జగన్ చెప్పే వివరాలను వీరు రికార్డు చేయనున్నారు. కాగా, నిన్న దాడి అనంతరం హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్, సిటీ న్యూరో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.  ఈ ఉదయం 10 గంటలకు జగన్ పై ఆసుపత్రి అధికారులు ఓ హెల్త్ బులెటిన్ విడుదల చేయనుండగా, ఆ తరువాత సిట్ అధికారులు జగన్ ను కలవనున్నారు.
Jagan
Hyderabad
DCP Mahendra Patrudu
Police

More Telugu News